Oct 28, 2024, 09:10 IST/
పెళ్లి పేరుతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య
Oct 28, 2024, 09:10 IST
పెళ్లి పేరుతో వేధించడంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మిడుతూరుకు చెందిన బాలిక కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. బాలికను తెలంగాణ పెబ్బేరు మండలం వెంకటాయంపల్లికి చెందిన సమీప బంధువు అయిన యువకుడు పెళ్లి చేసుకోవాలని వేధించినట్లుగా సమాచారం. దీంతో బాలిక వ్యాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకుంది.