వైఎస్ జగన్కు చెందిన పవర్ ఇండస్ట్రీస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వైఎస్ షర్మిల వ్యవహారాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్, షర్మిల ఆస్తుల పంపకాలు జరిగాయని అన్నారు. చెల్లి మీద ప్రేమతో జగన్ తన సొంత ఆస్తిలో 40 శాతం వాటా ఇవ్వాలని అనుకున్నారని, 2019లో ఎంఓయూ సైతం కుదుర్చుకున్నారని అన్నారు. అయితే షేర్లు ఎక్కడో పోయాయని చెప్పి జగన్కు తెలియకుండా షర్మిల దొంగ సంతకాలతో ఆస్తి తన పేరు మీద బదలాయించుకునే ప్రయత్నం చేశారన్నారు.