రౌతులపూడి: కార్మికశాఖ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ఘోర ప్రమాదం తప్పింది. రౌతులపూడి మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన శెట్టిబలిజల పిత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగ కార్యక్రమం నడుస్తుండగా సభా వేదిక ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో వేదిక మీద ఉన్న మంత్రి కిందపడబోగా భద్రతా సిబ్బంది అప్రమత్తమైన వెంటనే పట్టుకున్నారు.