అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కోరారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం రౌతులపూడి గ్రామంలో ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వందరోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలియజేశారు.