సత్యదేవుని సన్నిధిలో హైకోర్టు జడ్జి పూజలు
శంఖవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం రాష్ట్ర హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వారికి సత్యనారాయణ స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.