మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పూణె విమానాశ్రయం పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పూణెలోని లోహ్‌గావ్ విమానాశ్రయం పేరు మారుస్తూ.. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తదుపరి రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నారు.