తూ.గో జిల్లాలో ఘరానా మోసం
రాజమహేంద్రవరంలో నకిలీ వాగ్దానాలతో మోసం చేసిన ఘటన బుధవరం వెలుగులోకి వచ్చింది. ఇల్లు, స్థలం, ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సుమారు కోటి రూపాయలు వసూలు చేసిన సతీష్ తన కుటుంబంతో కలిసి ఉడాయిపోయాడు. బాధితులు రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. సతీష్ పలు కుటుంబాల వద్ద నుంచి నగదు, బంగారం తీసుకొని అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.