సీతానగరం లో భారీ అన్నసమారాధన
జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని 37 వ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి అన్నసమారాధన పాల్గొని అన్నప్రసాదం సేకరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా భజన సంకీర్తనలు నిర్వహిస్తామన్నారు. తరువాత రోజు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతా రామ భక్తి సమాజ బృందం సీతానగరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.