తాగునీటి పథకం పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
కాకినాడ జిల్లా, తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో రక్షిత మంచి నీరు పథకం మంజూరైనట్లు తుని ఎమ్మెల్యే యనమల దివ్య శుక్రవారం తెలియజేశారు. ఈసందర్భంగా ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.