భీమారం వద్ద బుధవారం కారు ఢీకొని మల్లేశ్ అనే యువకుడు మృతి చెందిన ఘటనలో అసలు నిజం బయటకు వచ్చింది. మల్లేశ్ మరణం రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని నిర్ధారణ అయ్యింది. కారు నడిపిన సాయికుమార్‌కు మల్లేశ్ భార్యతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మల్లేశ్ బైక్‌పై వెళ్తుండగా సాయికుమార్ కారుతో ఢీకొట్టాడు. రోడ్డు ప్రమాదమని పోలీసులను నమ్మించాడు. చివరికి జైపూర్ పోలీసుల విచారణలో కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు తేలింది.