కొద్ది రోజుల్లో హైదరాబాద్లో పెళ్లి పెట్టుకుని అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ గోవాలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నవంబరు 20 నుంచి గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 2024 వేడుకలలో గురువారం నాగచైతన్య, శోభితాతో పాటు అక్కినేని నాగార్జున, అమల కూడా హాజరయ్యారు.