Mar 21, 2025, 16:03 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: క్రికెట్ ఆడిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Mar 21, 2025, 16:03 IST
స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహించాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాజాపూర్ మండలం కల్లేపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.