అన్నవరం దేవస్థానం ఆదాయం రూ.1.01 కోట్లు

467చూసినవారు
అన్నవరం దేవస్థానం ఆదాయం రూ.1.01 కోట్లు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో గత 18 రోజులకు హుండీ ఆదాయం రూ. 1.01 కోట్లు సమకూరింది. ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు, అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో హుండీలను తెరచి సొమ్మును లెక్కించారు. అంతేకాకుండా 110 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి ఆభరణాలు, అమెరికా డాలర్లు 51, ఖతార్‌ కరెన్సీ 11 రియల్స్‌, సిరియా 1100 పౌండ్లు, ఆస్ట్రేలియా, కెనడా డాలర్లు 20 చొప్పున వచ్చాయన్నారు. రద్దయిన పాతనోట్లు రూ. వెయ్యి నోటు 1, రూ. 500 నోట్లు 42 వచ్చాయి. ఈ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఆలయ సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు, ఏఈవో ఎం.కె.టి.ఎన్‌.వి.ప్రసాద్‌, ధర్మకర్తల మండలి సభ్యులు కొత్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్