శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి.. దర్యాప్తులో సిట్ దూకుడు
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్కు పిలిపించి విచారించిన విషయం తెలిసిందే. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.