ISSకు చేరుకున్న SpaceX Crew-9 (Video)

61చూసినవారు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు చేపట్టిన స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ ఐఎస్ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. ఐఎస్ఎస్‌తో డాకింగ్ ప్రక్రియ పూర్తికాగానే క్రూ-9 మిషన్‌లోని నాసా వ్యోమగామి నిక్ హాగ్, రష్యన్ కాస్మొనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వీరితోపాటు అదే మిషన్‌లో సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ భూమిపైకి చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్