హైదర్ షా కోట్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్ళు కూల్చొద్దు అంటూ పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఒక చిన్న పాప మా ఇళ్లను కాపాడండి, మా భవిష్యత్తును రక్షించండి అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపింది. "మాకు న్యాయం కావాలి. మా ఇల్లు మాకు కావాలి. మా భవిష్యత్తుని కాపాడండి. మాకు దయచేసి సహాయం చేయండి." అంటూ ఓ చిన్నారి ప్రభుత్వాన్ని కోరింది.