

చంద్రబాబు కాళ్లపై పడిన YCP మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన జరిగింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ చంద్రబాబు కాళ్లపై పడ్డారు. దీంతో సీఎం ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. త్వరలోనే జయమంగళ టీడీపీలో పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వైఎస్ జగన్ కు మరో షాక్ తగలడం ఖాయం.