బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తు నిలిపివేయాలని కోరారు. అయితే, హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. విచారణకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని ఇమ్రాన్‌కు కోర్టు ఆదేశించింది.