AP: ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ముస్లింలకు శుభవార్త చెప్పారు. ముస్లిం పేదలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని ఆయన అన్నారు. ముస్లింలు 'జకాత్' కార్యక్రమంలో పేదలకు సహాయం చేస్తారని తెలిపారు. పేదలకు ఆర్థికసాయం చేసే గుణమున్న కమ్యూనిటీ ముస్లిం సోదరులదని అన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.