పాలకొల్లు: మంత్రి నిమ్మల కు సమస్యల వినతి
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటున్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం ఉదయం మంత్రి కార్యాలయం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. తమ సమస్యలను పరిశీలించాలని కోరుతూ వందలాదిమంది అర్జీలను సమర్పించారు. మంత్రి నిమ్మల, వారి అర్జీలను పరిశీలిస్తున్నారు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలను, ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.