‘నేను బతికే ఉన్నా.. నాకు పింఛన్ ఇప్పించండి’

75చూసినవారు
‘నేను బతికే ఉన్నా.. నాకు పింఛన్ ఇప్పించండి’
AP: నంద్యాల జిల్లా అయ్యలూరు గ్రామానికి చెందిన లింగమయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కర్నూలులోకి కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న లింగమయ్య.. ఆస్పత్రి సమీపంలో ఉంటూ కొన్నేళ్ల వరకు చికిత్స తీసుకున్నారు. అయితే పింఛన్ తీసుకోవడానికి ఆయన గ్రామానికి వచ్చారు. పింఛన్ ఐడీని పరిశీలించిన అధికారులు రికార్డుల్లో లింగమయ్య చనిపోయినట్లు ఉందని తెలిపారు. ‘నేను బతికే ఉన్నా.. నాకు పింఛన్ ఇప్పించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్