AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగానే రాష్ట్రంలో మగవారికి కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వం వీటికి కూడా రుణాలు మంజూరు చేయనుంది. దేశవ్యాప్తంగా ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీలోని విజయవాడ, విశాఖలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 2,841 గ్రూపులను ఏర్పాటు చేశారు. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకం రూపొందించినట్లు మెప్మా అధికారులు తెలిపారు.