వైసీపీ నేత చెవిరెడ్డి తనపై చేసిన ఆరోపణలను జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని ఖండించారు. తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెప్పు కోసం మాట్లాడుతున్నట్లు చెవిరెడ్డి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అదానీతో లంచం విషయంలో స్పందిస్తూ తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నా తన వద్దకు సీఎండీ ఫైల్ కూడా రాలేదన్నారు. తాను వైసీపీ నుంచి ఎందుకు బయటికొచ్చానో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెవిరెడ్డికి సవాల్ విసిరారు.