భారత రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనలు ముగించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.