శుక్రవారం నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.2,685 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. అయితే ఇదంతా ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటున్నట్లు ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నేటి నుంచి ప్రజలపై రూ.17,072 కోట్ల భారం మోపనుందని వైసీపీ పేర్కొంది. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామంటూ 20 సిలిండర్ల డబ్బుల్ని ప్రభుత్వం వసూలు చేస్తోందనని వైసీపీ చురకలంటిస్తోంది.