AP: కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో గురువారం రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందారు. పాత కక్షలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు.