నవంబర్ నెలలో సాధారణ, వారాంతాలు సహా మొత్తం దేశవ్యాప్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఉంటాో చూద్దాం. నవంబర్ 1న దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. నవంబర్ 3 ఆదివారం, నవంబర్ 9 రెండో శనివారం, 10 ఆదివారం, 15 కార్తీక పూర్ణిమ సందర్భంగా తెలంగాణ, 17 ఆదివారం, 23 నాలుగో శనివారం, 24వ తేదీ ఆదివారం సెలవులు ఉండనున్నాయి.