Oct 16, 2024, 13:10 IST/
TG: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Oct 16, 2024, 13:10 IST
దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలో బుధవారం, గురువారం, శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, HYD, MBNRతో పాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.