Mar 01, 2025, 09:03 IST/
మహిళా సంక్షేమ విధానాలపై అధ్యయన కమిటీ: మంత్రి సీతక్క
Mar 01, 2025, 09:03 IST
తెలంగాణలో మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సీతక్క వెల్లడించారు. సచివాలయంలో మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళల అభ్యున్నతి పథకాల అమలు పురోగతిని సమీక్షించారు.