దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌లో పండించే 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ రబీ పంటల ఎంఎస్పీ పెంపు కోసం రూ.87,657 కోట్లను కేంద్ర సర్కారు వెచ్చించనుంది. ఇక అదే సమయంలో రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్-యూరియా ఎరువుల సబ్సిడీకి రూ.24,475 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.