బాపట్ల పరిధిలోని వెస్ట్ బాపట్ల పంచాయతీలో ఉన్న బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ రూ.1.20కోట్లు పంచాయతీ పన్ను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు సోమవారం కలెక్టరేట్ ఎదురు మీడియా ముందు వివరించారు. ఈవోపీఆర్డి పులి శరత్ బాబు కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కాలేజీ బకాయిలను వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని డిమాండ్ చేశారు.