రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలి
రైతులందరూ ఖరీఫ్ సీజన్లో తాము వేస్తున్న పంటకు సంబంధించి ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించు కోవాలని చెరుకుపల్లి మండల వ్యవసాయ అధికారి బాలాజీ గంగాధర అన్నారు. మంగళవారం ఆయన కావూరు గ్రామంలో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము వేస్తున్న అన్ని రకాల పంటలను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పంటలో నమోదు చేయించుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, రైతులు పాల్గొన్నారు.