VIDEO: భారీ కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన కార్మికులు

60చూసినవారు
VIDEO: భారీ కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన కార్మికులు
TG: హైదరాబాద్‌లోని కీసర పోలీస్‌స్టేషన్‌ శివారులో ఆదివారం భారీ కొండచిలువ కనిపించింది. విగ్రహాలు తయారు చేసే షెడ్డులోకి కొండచిలువ రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించగా.. స్నేక్ స్నాచర్ రాజు ఘటనా స్థలికి చేరుకుని భారీ ఆకారంలో ఉన్న కొండచిలువ పట్టుకున్నాడు. అనంతరం అడవిలో వదిలేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్