Feb 17, 2025, 16:02 IST/
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్
Feb 17, 2025, 16:02 IST
తెలంగాణలోని వివిధ సంక్షేమ శాఖలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలపై TGPSC మరో అప్డేట్ ఇచ్చింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం(రేపు) ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు తెలిపింది. అలాగే 18న హాజరు కానీ అభ్యర్థులకు 19న వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.