ముంబయి నుంచి రాయ్‌గఢ్ సమీపంలోని రేవ్‌దండా బీచ్‌కు ఫెరారీ కారులో వెళ్లిన ఇద్దరు ఔత్సాహికులకు వింత అనుభవం తప్పలేదు. బీచ్‌లో సరదాగా విహరిస్తున్న క్రమంలో వీరి కారు ఇసుకలో కూరుకుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారంతా వచ్చి బయటకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఎడ్లబండిని సాయం కోరారు. ఫెరారీ కారు ముందుభాగంలో తాడు కట్టి ఎడ్లబండితో లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.