4న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

79చూసినవారు
4న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 4న సా.4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కొత్త రేషన్‌ కార్డులు, రైతుభరోసా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల సాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్‌ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, పర్యాటక పాలసీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, అన్ని శాఖల్లో ఉన్న ఇతర పెండింగ్‌ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్