Oct 16, 2024, 05:10 IST/
మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Oct 16, 2024, 05:10 IST
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా పసిడి ధర మరోసారి పెరిగింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరలతో పోల్చితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.71,400కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.77,890 అయింది. ఇక వెండి ధర కిలో రూ.96,800గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.