నా చావుకు ఎవరూ కారణం కాదంటూ' సూసైడ్ నోట్ రాసి వ్యక్తి మృతి
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నపాడు వీఆర్ఓ అదృశ్యానికి సంబంధించిన సూసైడ్ నోట్ బుధవారం లభ్యమయింది. దీనిపై ఎస్సై సోమేశ్వరరావు మాట్లాడుతూ.. వీఆర్వో మల్లికార్జునరావు సూసైడ్ నోట్లో నా చావుకి ఎవరూ కారణం కాదని ఇల్లు నరకంలో మారిపోయింది అందువల్ల మానసిక ఒత్తిడి లోనయ్యానంటూ నోట్లో పేర్కొన్నారని తెలిపారు. దీనిపై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలియజేశారు.