Oct 27, 2024, 03:10 IST/మంథని
మంథని
రామగిరి: పోస్టాఫీస్ లో దాచిన పేదల డబ్బులు స్వాహా
Oct 27, 2024, 03:10 IST
పేదలు రూపాయి రూపాయి జమ చేసుకుని పోస్టాఫీసులో పొదుపు చేసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల్లో స్వాహా చేసిన ఉదంతమిది. నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి పొదుపు ఖాతాల్లోని డబ్బు స్వాహా చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో జరిగింది. దీంతో బేగంపేట పోస్టాఫీస్ ఎదుట పాస్ పుస్తకాలతో తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ డిపాజిటర్లు ఆందోళన చేపట్టారు.