కస్తూర్బా పాఠశాలలో విచారణ చేపట్టిన ఆర్డీఓ
రెంటచింతల మండలం మిట్టగుడిపాడు కస్తూర్భా బాలికల పాఠశాల వసతిగృహంలో నిద్రిస్తున్న విద్యార్థినులను ఇటీవల ఎలుక కరిచిన ఘటనపై శుక్రవారం గురజాల ఆర్డీఓ రమాకాంతరెడ్డి విచారణ జరిపారు. ఘటన జరిగిన వెంటనే వీఆర్వో వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు తహశీల్దార్ కరుణకుమార్ జిల్లా కలెక్టరుకు నివేదిక పంపారు.