Apr 06, 2025, 18:04 IST/
చిగుళ్ల నుంచి రక్తం వస్తే గుండెకు ముప్పు
Apr 06, 2025, 18:04 IST
చిగుళ్ల నుంచి రక్తం వస్తే గుండెకు ముప్పు అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో చిగుళ్ల వ్యాధి ఒకటి. చిగుళ్ల వ్యాధి క్రమంగా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని పలు పరిశోధనల్లో తేలింది. తొలి దశలో చిగుళ్ల వాపు, చిగుళ్ల చికాకు, రక్త స్రావం జరుగుతుంది. సరైన చికిత్స చేయకపోతే ఈ వ్యాధి తీవ్రమవుతుంది. దీంతో దంతాలు వదులు కావడం లేదా రాలిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు.