జపాన్‌కు చెందిన కంపెనీ కవాసకి ఇటీవల ఓసాకా-కన్సాయ్ ఎక్స్‌పో 2025లో తన కొత్త కాన్సెప్ట్ రోబోట్ 'కార్లియో'ను పరిచయం చేసింది. ఇది నాలుగు కాళ్లతో కూడిన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రోబోటిక్ వాహనం. రైడర్స్ కోసం రూపొందించబడింది. కార్లియోలోని నాలుగు స్వతంత్ర కాళ్లు వివిధ రకాల నేలపై స్థిరంగా, సమతుల్యంగా కదలడానికి అనుమతిస్తాయి. 150cc హైడ్రోజన్ ఇంజిన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, ఈ కాళ్లను నడిపిస్తుంది.