TG: నటి కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు ఇచ్చారు. గతంలో తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించారని ఆమె ఆరోపించారు. ‘సినిమా వాళ్లను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు. నాలా మరొకరికి జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాపై మీడియాతోనే అసభ్యంగా మాట్లాడారు. నేను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యా. ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకే చట్టపరంగా లీగల్ నోటీసులు ఇస్తున్నా’ అని హేమ తెలిపారు.