రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైలు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోవడానికి గల కారణాలను సీఎం స్టాలిన్ మీడియాకు వివరించారు. తాను రాలేన్న విషయాన్ని ముందుగానే ప్రధానికి తెలియజేశానని, ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి రావడంతో వెళ్లలేకపోయానన్నారు. తమ ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ ప్రధానికి స్వాగతం పలికారని అన్నారు.