రైల్లో అనారోగ్యంతో వృద్ధుడి మృతి
ఒడిశా రాష్ట్రం బరంపూర్ ప్రాంతానికి చెందిన బలరాం ప్రధాన్ (66) కేరళ రాష్ట్రంలోని కొట్టాయం ఇటుక బట్టీల్లో కార్మికుడిగా పని చేస్తూ.. మృతుడు తన ఊరికి వెళ్లటానికి కొట్టాయంలో ఆదివారం గురుదేవ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కగా.. మార్గమధ్యలో అనారోగ్య సమస్యలతో సోమవారం మృతి చెందారు. తెనాలి సమీపంలో విషయాన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు అధికారులకు తెలుపగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసారు