ప్రజా సమస్యల పరిష్కారానికి వారధి
ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే వారధి కార్యక్రమ ప్రధానోద్దేశమని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. శనివారం ఫిరం గిపురంలో వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు ఏ సమయంలోనైనా నిర్భయంగా, స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. మహిళలపై అత్యాచార ఘటనలకు ఒక రకంగా ఫోన్లు, సోషల్ మీడియా ప్రేరేపితమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సీఐ వీరేంద్ర బాబు, ఎస్.ఐ సదాశివరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు