ప్రియుడిలో కలిసి చిన్నారిని చిత్రహింసలు పెట్టిన తల్లి

65చూసినవారు
ప్రియుడిలో కలిసి చిన్నారిని చిత్రహింసలు పెట్టిన తల్లి
AP: విజయవాడ శివారు ప్రాంతమైన వైఎస్సార్ కాలనీకి చెందిన వందన భర్తను వదిలేసింది. ఆమెకు ప్రసన్న (3) అనే కూతురు ఉంది. చిట్టినగర్‌కు చెందిన శ్రీరామ్‌తో వందనకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి పాపను తీసుకుని 7 నెలల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. వీరి కాపురానికి పాప అడ్డుగా మారిందని.. తరచూ ప్రసన్నను కొట్టడం, శరీరంపై వాతలు పెట్టేవారు. అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్