ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనతో ఫోటోలు దిగి, వాటిని ఉపయోగిస్తూ ఇసుక, భూ దందాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. తన పేరును వాడుకొని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ఉన్న సారిపల్లిపాలెం నివాసంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆమెను కలిశారు. వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.