హైదరాబాద్ నుమాయిష్‌ వాయిదా

56చూసినవారు
హైదరాబాద్ నుమాయిష్‌ వాయిదా
హైదరాబాద్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్‌‌ను రెండు రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో జనవరి 3న నుమాయిష్‌ ప్రారంభం కానుంది. కాగా, హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రతి ఏడాది నుమాయిష్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్