AP: కుంభమేళాకు రైళ్లను మళ్లించడంతో పలు సర్వీసులను మార్చి 1 వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తిరుపతి-కదరిదేవరపల్లి ప్యాసింజర్, గుంతకల్-తిరుపతి ప్యాసింజర్, తిరుపతి-హుబ్లీ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్లను 2 నెలలు నిలిపేసింది. వీటితో పాటు తిరుపతి- కడప మీదుగా ధర్మవరం మార్గంలో నడిచే 6 రైళ్లు రద్దు కావడంతో.. తమకు రైల్వే బోర్డు ప్రత్యామ్నాయం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.